Viral News: తల్లిని చంపి.. అవయవాలు వేపుకుని తినేసి..!
Viral News: ఓ వ్యక్తి కన్నతల్లిని చంపేసి ఆమె అవయవాలను వేపుకు తిన్న దారుణ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో చోటుచేసుకుంది. 2017లో సునిల్ అనే వ్యక్తి తన తల్లి రమను దారుణంగా హత్యచేసాడు. ఆ తర్వాత అవయవాలు తీసి వేయించుకుని మరీ తిన్నాడట. ఇతనికి 2021లో కొల్హాపూర్ న్యాయస్థానం ఉరిశిక్ష వేసింది. దాంతో సునీల్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేసాడు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ఉరిశిక్ష వేయాలా వద్దా అనే విషయంపై చర్చిస్తోంది. దాంతో సునీల్‌కి సంబంధించిన సైకలాజికల్, సైకియాట్రిక్ రిపోర్టులు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ రిపోర్టులతో పాటు జైల్లో సునీల్ ప్రవర్తనా తీరును బట్టి ఉరిశిక్ష వేయాలా లేక యావజ్జీవ కారాగార శిక్ష వేయాలా అనేది నిర్ణయిస్తారట.