Iphone: క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి.. డెలివరీ బాయ్‌ని నరికి..
Iphone: ఇటీవల కొత్తగా రిలీజ్ అయిన ఐఫోన్ 16ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నాడు ఓ వ్యక్తి. ఇందుకోసం ఆన్‌లైన్‌లో ఐఫోన్ ఆర్డర్ పెట్టి తెలివిగా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు. పాపం డెలివరీ బాయ్ ఐఫోన్ డెలివర్ చేద్దామని వెళ్లగా.. డబ్బు ఎగ్గొట్టేందుకు అతనికి దారుణంగా చంపేసాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న భరత్ అనే వ్యక్తి సెప్టెంబర్ 24న ఐఫోన్ డెలివరీ ఇచ్చేందుకు లఖ్‌నౌలోని చిన్హాట్ ప్రాంతానికి వెళ్లాడు. ఐఫోన్ డెలివరీ చేస్తున్న సమయంలో ఇద్దరు యువకులు అతన్ని పొడిచి చంపేసారు. ఆ తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ముక్కలుగా నరికి స్థానికంగా ఉన్న కాలువలో పడేసారు. రెండు రోజులుగా భరత్ ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. చివరి డెలివరీ చిన్హాట్ ప్రాంతంలో జరిగిందని తెలిసి ఐఫోన్ ఆర్డర్ పెట్టిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
వారు నిజాన్ని ఒప్పుకోవడంతో కాలువ నుంచి భరత్ మృతదేహాన్ని వెలికి తీయించి పోస్ట్‌మార్టెంకు పంపారు. అయితే ఆ యువకులు భరత్ మృతదేహాన్ని ముక్కలుగా నరకేలేదని.. ఓ బ్యాగులో కుక్కి కాలువలో పడేసారని పోలీసులు చెప్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.