భార్యతో డ్యాన్స్.. తమ్ముళ్లను చంపేసిన అన్న
Chhattisgarh: సోదరులు తన భార్యతో డ్యాన్స్ చేసారని వారిని దారుణంగా చంపేసాడు ఓ కసాయి వ్యక్తి(murder). ఈ దారుణ ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో(chattisgarh) చోటుచేసుకుంది. కబీర్‌దామ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పీకలదాకా తాగి తన బంధువుల పెళ్లికి వెళ్లాడు. అప్పటికే అతని భార్య పెళ్లి మండపానికి చేరుకుని మరుదులతో డ్యాన్స్ చేస్తోంది. అది చూసి సహించలేకపోయిన ఆ వ్యక్తి.. వదినతో డ్యాన్సులు చేస్తారా అంటూ కత్తితో వారిపై దాడి చేసారు. దాంతో తీవ్రంగా బ్లీడ్ అవడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను తాగిన మైకంలో వారిని చంపేసాడని పోలీసులు తెలిపారు.