వృద్ధుడి శవం దాచుకుని.. పెన్షన్ వాడుకుంటూ..
Britain: ఓ వ్యక్తి వృద్ధుడి(old man) శవాన్ని దాచుకుని అతనికి వచ్చే పెన్షన్(pension) వాడుకుంటూ ఎంజాయ్ చేసిన ఘటన బ్రిటన్‌లో(britain) చోటుచేసుకుంది. బ్రిటన్‌కు చెందిన జాన్ అనే 71 ఏళ్ల వ్యక్తి 2018లో చనిపోయాడు. అయితే అతని శవం రెండేళ్ల తర్వాత ఓ ఫ్రీజర్‌తో దొరకండంతో పోలీసులు షాకయ్యారు. ఇందుకు కారణం జాన్‌తో పాటు ఒకే ఫ్లాట్‌లో ఉంటున్న డామియన్ అనే వ్యక్తి. జాన్ చనిపోయాక డామియన్ అతనికి అంత్యక్రియలు వంటివి నిర్వహించకుండా శవాన్ని ఫ్రీజర్‌లో దాచాడు. అలా జాన్‌కి నెల నెలా వస్తున్న పెన్షన్‌ను కూడా వాడేసుకుంటూ షాపింగ్, ట్రిప్స్ చేస్తూ ఎంజయ్ చేసాడు. పోలీసులకు శవం దొరికిన తర్వాత డామియన్‌ను అరెస్ట్ చేసారు. అయితే తాను జాన్ శవం దాచిన మాట నిజమే కానీ వాడుకుంటున్న డబ్బులు మాత్రం అతనికి వస్తున్న పెన్షన్ కాదని.. ఇద్దరిదీ జాయింట్ ఖాతా అని తెలిపాడు. దాంతో కోర్టు అతని కేసుని వాయిదా వేసి ప్రస్తుతానికి బెయిల్ మంజూరు చేసింది.