Tattoo: ఏకంగా డ్రాయ‌రే టాట్టూగా..!

Hyderabad: పిచ్చోళ్ల గురించి విన‌డ‌మే కానీ చూడ‌టం ఇదే మొద‌టిసారి అన్నట్టు.. ఓ వ్య‌క్తి ఏకంగా డ్రాయ‌ర్‌నే టాట్టూగా (tattoo) వేయించేసుకున్నాడు. పాపం అత‌ని ద‌గ్గ‌ర లోదుస్తులు లేవేమో. లేక కొనుక్కునే వీలు వేసుకునే ఓపిక లేక ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడో తెలీదు కానీ ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ బ్రాండ్ కల్విన్ క్లైన్ (calvin klein) అండ‌ర్‌వేర్‌ను టాట్టూగా వేయించేసుకున్నాడు. మార్కెట్‌లో అండ‌ర్‌వేర్ల బ్రాండ్లు ఎన్నో ఉన్నాయి కానీ వాటిలో బాగా హిట్ అయిన బ్రాండ్ కాల్విన్ క్లైన్. దాదాపు 25 ఏళ్లుగా ఈ బ్రాండ్ మార్కెట్‌లో లాభాలు అర్జిస్తోంది. ఆ టాటూ వేయించుకున్న వ్య‌క్తి వివ‌రాలు తెలియ‌రాలేదు. ఈ ఫొటోను ఒక యూజ‌ర్ రెడిట్ యాప్‌లో పోస్ట్ చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వచ్చింది.