90 అత్యాచారాలు.. 42 సార్లు యావజ్జీవ కారాగార శిక్ష
Viral News: చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవ్వరినీ వదల్లేదు ఆ నీచుడు. తన జీవితం మొత్తంలో ఏకంగా 90 అత్యాచారాలకు పాల్పడ్డాడు. దక్షిణాఫ్రికాకి చెందిన ఫకాతీ అనే వ్యక్తి తన జీవితంలో చేయని నేరం అంటూ లేదు. వీధుల దగ్గర కాచుకుని కూర్చుని స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే ఆడపిల్లలను దారుణంగా అత్యాచారం చేసేవాడు. అలా తొమ్మిదేళ్ల బాలికల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఎవ్వరినీ వదల్లేదు. దొంగతనాలు, కిడ్నాప్, అత్యాచారాలు ఇలా ఎన్నో ఘోరాలకు పాల్పడ్డాడు.
కొన్ని సందర్భాల్లో తనని తాను ఎలక్ట్రిషియన్‌గా చెప్పుకుంటూ ఇళ్లల్లోకి దూరి మరీ అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఇంకొన్ని సంఘటనల్లో ఆడపిల్లలపై వారి ఫ్రెండ్స్ చేసే రేప్‌లు చేయించాడు. అలా మొత్తానికి పోలీసులు అతన్ని పట్టుకుని జొహానెస్బర్గ్ కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి తీర్పు వెలువరిస్తూ 42 సార్లు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అంటే అతను జీవితంలో జైలు నుంచి బయటికి రాలేడు. అరెస్ట్ తర్వాత అతను పారిపోబోతుంటే పోలీసులు కాలిపై తుపాకీతో కాల్చారు. ఇందుకు అతనికి చికిత్స కూడా ఇప్పించకూడదని జడ్జి వెల్లడించారు.