ఆన్‌లైన్‌లో మ‌గాళ్ల‌ను ఊరించి.. భార్య‌పై 50 మందితో అత్యాచారం చేయించి..

man drugged wife and allowed 50 men to rape her

 

Viral News: ఇంత‌కంటే ఘోరం మ‌రొక‌టి ఉంటుందా? భార్య‌కు తెలీకుండా ఆమెకు డ్ర‌గ్స్ ఇస్తూ ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 50 మంది చేత ఆమెపై అత్యాచారం చేయించాడు ఓ సాడిస్ట్ భ‌ర్త‌. ఈ దారుణ ఘ‌ట‌న ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది. ఫ్రాన్స్‌లోని అవిగ్నాన్ ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు.. త‌న భార్య‌కు దాదాపు ప‌దేళ్లుగా డ్ర‌గ్స్ ఇస్తున్నాడు. ఈ విష‌యం ఆమెకు తెలీదు. ఆ త‌ర్వాత ఆన్‌లైన్‌లో మ‌గ‌వారిని ప‌రిచయం చేసుకుని త‌న భార్య‌తో సెక్స్ చేసే అవ‌కాశం ఇస్తా అని ఊరించేవాడు. అలా ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 50 మంది చేత త‌న భార్య‌ను అత్యాచారం చేయించాడు. ఆమె డ్ర‌గ్స్ మ‌త్తు నుంచి తేరుకోగానే మామూలుగా ప్ర‌వ‌ర్తించేవాడు.

2020లో ఈ వ్య‌క్తి ఓ అమ్మాయి వేసుకున్న స్క‌ర్ట్‌ను వీడియో తీస్తుండ‌గా పోలీసులు ప‌ట్టుకున్నారు. అత‌ని ఫోన్ చెక్ చేయ‌గా అత‌ని భార్య‌పై చాలా మంది మ‌గ‌వారు అత్యాచారం చేస్తున్న వీడియోలు ఉండ‌టంతో వెంట‌నే అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత ఈ విష‌యం అత‌ని భార్య‌కు తెలిసి ఆమె కుమిలిపోయింది. ఫ్రాన్స్‌కి చెందిన ఓ న్యాయ‌స్థానం ఈ కేసును ప్రైవేట్‌గా హ్యాండిల్ చేద్దాం అని సూచించ‌గా.. త‌న‌కు జ‌రిగిన అన్యాయం ప్ర‌పంచానికి తెలియాల‌ని వాద‌న‌లు ప‌బ్లిక్‌లో ఉంచాల‌ని కోర‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. నిందితుడిపై గ‌తంలో రేప్ కేసులు కూడా ఉన్నాయ‌ని తేలింది. నిందితుడితో పాటు ఆ 50 మంది మ‌గ‌వారిని కూడా న్యాయ‌స్థానం విచార‌ణ‌కు పిలిపించ‌గా.. త‌మ‌కు అత్యాచారం అని తెలీద‌ని.. భార్యాభ‌ర్త‌ల‌కు అదొక సెక్సువ‌ల్ ఫాంట‌సీ అనుకుని ఆమెతో సెక్స్ చేసామ‌ని బుకాయించారు. ఈ కేసుపై ఇంకా విచార‌ణ జ‌రుగుతోంది.