సిక్స్ కొట్టాడు.. గుండెపోటుతో చ‌నిపోయాడు

man dies of heart attack while playing cricket

Heart Attack: ఓ యువ‌కుడు క్రికెట్ ఆడుతూ ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలిపోయాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని థానేలో చోటుచేసుకుంది. స్థానిక మీరా రోడ్డు ప్రాంతంలో ఈరోజు ఉద‌యం లోకల్ క్రికెట్ మ్యాచ్ జ‌రిగింది. బ్యాటింగ్ చేస్తున్న వ్య‌క్తి సిక్స్ బాది ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలిపోయాడు. అత‌న్ని వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతోనే చ‌నిపోయాడ‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.