Suicide: ప్రేయ‌సి నింద‌.. లైవ్‌లో ఆత్మ‌హ‌త్య‌

ఆల్రెడీ వివాహ‌మైన యువ‌కుడిపై ఓ యువ‌తి రేప్ ఆరోప‌ణ‌లు చేయ‌డంతో అత‌ను ఫేస్‌బుక్ లైవ్‌లోనే ఆత్మ‌హ‌త్య (suicide) చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌కి చెందిన మ‌నీష్ అనే వ్య‌క్తికి ఆల్రెడీ వివాహం అయింది. అయినా కూడా ఓ యువ‌తితో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ 5న‌ మ‌నీష్‌.. ఆ యువ‌తి కుటుంబీకుల‌తో ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడాడు. ఆ స‌మ‌యంలో వారు రూ.5 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని లేదంటే రేప్ చేసిన‌ట్లు కేసు వేస్తామ‌ని బెదిరించారు. సెప్టెంబ‌ర్ 6న ఆ యువ‌తి క‌నిపించ‌కుండాపోవ‌డంతో ఆమెను మ‌నీష్ లేపుకుపోయాడ‌ని ఆరోపించారు. అయితే మ‌నీష్ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా త‌ను అస‌లు ఆ అమ్మాయితో ఎలాంటి శారీర‌క సంబంధం పెట్టుకోలేద‌ని చెప్పి చెరువులో దూకేసాడు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అవ‌డంతో వెంట‌నే పోలీసులు రంగంలోకి దిగారు. ఆ యువ‌కుడి మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీసి కుటుంబీకులకు అప్ప‌గించారు. ఈ కేసులో న‌లుగురు వ్య‌క్తుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  (suicide)