Vanasthalipuram: పెళ్లి చూపులు ఒక‌రితో.. పెళ్లి మ‌రొక‌రితో

man cheated a woman in vanasthalipuram

Vanasthalipuram: పెళ్లి పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని వ‌న‌స్థ‌లిపురంలో చోటుచేసుకుంది. వనస్థలిపురంకి చెందిన ఓ అమ్మాయితో ఎస్‌బీఐలో పనిచేస్తున్న నంద కుమార్ అనే వ్యక్తికి ఆరు నెలల క్రితం పెళ్లి చూపులు జరిగాయి. ఇద్ద‌రికి ఒక‌రికొక‌రు న‌చ్చారు. కానీ నిశ్చితార్థం అనేది లేకుండా ఇద్దరి మధ్య ఆరు నెలలుగా బంధం కొన‌సాగింది. ఈ నేప‌థ్యంలో ఉన్నట్టుండి నంద‌కుమార్ మ‌రో యువతితో పెళ్లికి సిద్ధ‌మ‌య్యాడు. తమ అమ్మాయిని మానసికంగా, శారీరకంగా వాడుకుని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని అమ్మాయి త‌ర‌ఫు కుటుంబ స‌భ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిందితుడి ఇంటి ముందు బైఠాయించారు.