కాబోయే భార్యను రేప్ చేసి.. స్నేహితుల చేత లైంగికంగా వేధించి..
Viral News: ఇంకొన్ని రోజుల్లో పెళ్లి ఉందనగా.. కాబోయే భార్యను హోటల్‌కు రమ్మని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నీచుడు. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. అన్షు చౌదరి అనే వ్యక్తికి ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయ్యింది. ఇంకో నెల రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. అన్షు ఆమెను రేప్ చేసి వదిలించుకోవాలనుకున్నాడు. అలా తనకు కాబోయే భార్యతో రిషికేష్‌కు వెళ్దామని తన ఫ్రెండ్స్ కూడా వస్తారని ఎంజాయ్ చేయచ్చని చెప్పాడు. ఆ అమ్మాయి కూడా ఓకే అంది.
అలా అన్షు ఆ అమ్మాయిని తీసుకుని రిషికేష్ వెళ్లాడు. అక్కడ ఓ హోటల్‌లో దిగగానే అన్షు రాక్షసుడిగా ఆమెపై పడ్డాడు. ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా కొరికేసాడు. ఆ తర్వాత ఏమీ తెలీనట్లు ఆమెను మళ్లీ ఘజియాబాద్‌కు తీసుకెళ్తుండగా.. అన్షు తన ముగ్గురు స్నేహితుల్ని దారిలో ఎక్కించుకుని తనకు కాబోయే భార్యను లైంగికంగా వేధించేలా చేసాడు. అంతటితో ఆగకుండా ఆమెను ఓ పెట్రోల్ పంప్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాలు షాక్‌లో పెట్రోల్ పంప్ దగ్గర ఏడుస్తూ ఉండటంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అన్షుని అతని ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.