Korutla: ఎస్సై కొట్టిందని ఆత్మహత్యాయత్నం
Korutla: ఎస్సై కొట్టిందని ఓ వ్యక్తి మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసాడు. ఈ ఘటన కోరుట్లలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో.. శివప్రసాద్ అనే వ్యక్తిపై ఈ నెల 19న అతని భార్య కవిత ఫిర్యాదు చేసింది. ఈ నెల 22న కౌన్సిలింగ్ నిమిత్తం శివ ప్రసాద్‌ను స్టేషన్‌కు పిలిపించి కోరుట్ల ఎస్సై శ్వేత అతనిపై చేయిచేసుకుందట. ఆ అవమానం తట్టుకోలేక మరుసటిరోజు ఉదయం ఒంటిపై పెట్రోల్ పోసుకుని శివప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. వెంటనే అతన్ని హాస్పిటల్‌లో చేర్పించారు. ఎస్సై వల్ల తన అన్నకు ఏమైనా జరిగి ఉంటే ఏంటి పరిస్థితి అంటూ శివప్రసాద్ సోదరి మీడియాతో తన ఆవేదనను చెప్పుకున్నారు.