Hyderabad: ప్రియురాలి గొంతుకోసి.. తానూ కోసుకుని..

హైద‌రాబాద్‌లోని (hyderabad) కుషాయిగూడ‌లో (kushaiguda) దారుణం చోటుచేసుకుంది. బ్రేకప్ చెప్పింద‌ని వ‌ర్ష్ అనే యువ‌కుడు  అమ్మాయి గొంతుకోసి ఆ త‌ర్వాత తానూ కోసుకున్నాడు. వీరిద్ద‌రినీ ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అమ్మాయి కారులో ప్ర‌యాణిస్తోంద‌ని తెలిసి కారు అద్దాలు ప‌గ‌ల‌గొట్టి మ‌రీ ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు. వీరిద్దరూ గీతాంజ‌లి ఇంజినీరింగ్ కాలేజ్‌లో చ‌దువుకుంటున్న‌ప్ప‌టి నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇటీవ‌ల ఆ అమ్మాయి అబ్బాయికి బ్రేక‌ప్ చెప్ప‌డంతో ఒక‌సారి మాట్లాడాలి రా అని పిలిచి ఈ చ‌ర్యకు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది.