గ‌ర్ల్‌ఫ్రెండ్ కావాల‌ని పోలీసుల‌ను రిక్వెస్ట్ చేసిన యువ‌కుడు

man asks police to help him find girl friend

Viral News: త‌న‌కు ఒక గ‌ర్ల్‌ఫ్రెండ్ కావాల‌ని ఓ యువ‌కుడు ఏకంగా పోలీసుల‌నే రిక్వెస్ట్ చేసాడు. నేరుగా వెళ్లి అడిగుంటే సీన్ మ‌రోలా ఉండేది. సోష‌ల్ మీడియాలో అడిగాడు కాబ‌ట్టి వాళ్లు రిప్లై ఇచ్చి ఊరుకున్నారు.  శివ‌మ్ భ‌ర‌ద్వాజ్ అనే యువ‌కుడు ఢిల్లీ పోలీసుల‌కు ఇలా ట్వీట్ పెట్టాడు. నాకు ఎప్పుడు గ‌ర్ల్‌ఫ్రెండ్‌ని సెట్ చేస్తారు స‌ర్? నేను ఇప్ప‌టికీ సింగిల్‌గానే ఉన్నా. మీరు ఇలా చేయ‌డం క‌రెక్ట్ కాదు అని ట్వీట్ పెట్టాడు. ఇందుకు ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ.. మీ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఒక‌వేళ త‌ప్పిపోతే త‌ప్ప‌కుండా వెతికిపెడ‌తాం అని రిప్లై ఇచ్చారు. ఇత‌ను మ‌ళ్లీ ఇలాంటి ట్వీట్స్ పెడితే నేరుగా ప‌ట్టుకుపోయి జైల్లో పెట్టేలానే ఉన్నారు.