భార్య బోర్ కొట్టేసింది.. మరదలిపై మనసు మళ్లింది
Affair: ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని కొన్నాళ్ల తర్వాత ఆమె బోర్ కొట్టడంతో చెల్లితో ప్రేమాయణం సాగించాడు ఓ నీచుడు. పైగా ఆ అమ్మాయిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు కూడా. అమ్మాయి మైనర్ కావడం షాకింగ్ విషయం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహరాజ్ గంజ్ ప్రాంతానికి చెందిన గౌతమ్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో పెళ్లైంది. కొన్ని నెలల వరకు ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. ఇంతలో ఏమైందో ఏమో… గౌతమ్‌కి తన భార్య మైనర్ చెల్లెలిపై మనసు మళ్లింది. దాంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని అనుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఆగస్ట్ 24న తన చిన్న కూతురు కనిపించకపోవడంతో గౌతమ్ మామగారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. గౌతమ్ తన చిన్న కూతురిపై కన్నేసాడని.. అతనే కిడ్నాప్ చేసి ఉంటాడని పోలీసులకు వెల్లడించారు. పోలీసులు గౌతమ్ ఫోన్ నెంబర్‌ను ట్రాక్ చేయగా.. అతను ఢిల్లీలో ఉంటున్న తన సోదరి ఇంట్లో ఉంటున్నాడని తెలుసుకున్నారు. ఢిల్లీ పోలీసుల సాయంతో గౌతమ్‌ను అరెస్ట్ చేసి చిన్న కూతురిని క్షేమంగా అప్పగిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.