Kollam Chennai Express: తప్పిన పెను ప్రమాదం
Tamilnadu: తమిళనాడులో (tamilnadu) భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. కొల్లం-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోని (kollam chennai express) ఓ కోచ్‌లో పగుళ్లు గుర్తించడంతో వెంటనే ఆ కోచ్‌ను రైలు నుంచి విడదీసారు. లేకపోతే ఒడిశా లాంటి మరో ప్రమాదం జరిగేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన ఆదివారం సెంగొట్టాయ్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. నిన్న సాధారణ చెకింగ్ సమయంలో కొల్లం చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు నెంబర్ 16102లోని S3 కోచ్‌లో పగుళ్లు కనిపించినట్లు సెంగొట్టాయ్ రైల్వే స్టేషన్ అధికారులు గుర్తించారు. వెంటనే రైలును ఒక గంట పాటు నిలిపివేసి ఆ కోచ్‌ను విడదీసారు. కోచ్‌లో ఉన్న ప్రయాణికులను వేరే కోచ్‌లోకి తరలించారు. అది గమనించకుండా ఉండి ఉంటే మరో ఒడిశా ఘటన జరిగి ఉండేదని అధికారులు తెలిపారు. పగుళ్లు గుర్తించిన రైల్వే అధికారి పనితనానికి మెచ్చి అతనికి అవార్డు వచ్చేలా చేస్తామని సదరన్ రైల్వే అధికారులు తెలిపారు. ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాద (odisha train accident) ఘటన తర్వాత భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పట్టాలు, కోచ్‌లు పరిశీలిస్తున్నారు.