Maharashtra Police: అడ్రెస్ పెట్టు నీదోసారి..!

Mumbai: ఆదిపురుష్ (adipurush) సినిమాలోని వాన‌ర‌సేన క్యారెక్ట‌ర్‌లో న‌టించిన వ్య‌క్తి అచ్చం మ‌హారాష్ట్ర సీఎం ఏక‌నాథ్ శిండేలా (eknath shinde) ఉన్నాడ‌ని కామెంట్ చేసి ఇరుక్కున్నాడు ఓ యువ‌కుడు. మ‌హారాష్ట్ర‌లోని థానేకు (maharashtra police) చెందిన అభ‌య్ అనే యువ‌కుడు.. ఆదిపురుష్ సినిమాలో వాన‌ర సేన క్యారెక్ట‌ర్‌లో న‌టించిన ఓ వ్య‌క్తి ఫొటోను ట్విట‌ర్లో షేర్ చేస్తూ.. ఈ సినిమాలో ఏక‌నాథ్ శిండే (eknath shinde) ఉన్నాడ‌ని నాకు తెలీదు అని కామెంట్ చేసాడు. ఇది చూసిన థానే పోలీసులు నీ వివ‌రాలు మాకు పంపు అని ట్వీట్ చేసారు. ఇందుకు అభ‌య్.. ఎందుకు స‌ర్ అని అడిగితే.. చెప్తాం.. నువ్వు వెంట‌నే ఈ నెంబ‌ర్‌కు కాల్ చెయ్యి అని రిప్లై ఇచ్చారు. దాంతో త‌న ప‌ని అయిపోయింది అనుకుని భ‌య‌ప‌డిపోయాడు. వెంట‌నే ట్విట‌ర్ ఖాతాను డిలీట్ చేసి ఇంట్లో నుంచి పారిపోయాడు. దాంతో అత‌న్ని ప‌ట్టుకునే ప‌నిలో థానే పోలీసులు ఉన్నారు.