Ravi Uppal: కోట్ల స్కాంలో సెలబ్రిటీలను బుక్ చేసిన మహదేవ్ యాప్ ఫౌండర్ అరెస్ట్
Ravi Uppal: మహదేవ్ యాప్ (mahadev app) పేరిట అమాయకుల్ని మోసం చేస్తూ రోజుకు రూ.200 కోట్ల మేర సంపాదించిన నిందితుడు రవి ఉప్పల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌లోని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవిని ఇండియాకు రప్పించేందుకు యత్నాలు జరుగుతున్నాయి.
ఈ మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా రవి ఉప్పల్ సెలబ్రిటీలను కూడా బుక్ చేసాడు. ఇది లీగల్ గేమింగ్ యాప్ అని నమ్మించి రణ్‌బీర్ కపూర్ లాంటి టాప్ నటులను ప్రచారకర్తలుగా వాడుకున్నాడు. దాంతో పోలీసులు రణ్‌బీర్‌కి కూడా నోటీసులు జారీ చేసారు. దాదాపు రూ.6000 కోట్ల మేర ఈ మహదేవ్ యాప్ స్కాం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఛత్తీస్‌గడ్‌లో ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌కు ఈ యాప్ ద్వారా రూ.500 కోట్ల పార్సెల్ అందినట్లు ఈడీ అధికారులు చెప్తున్నారు. UAEలో కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకుని అక్కడి నుంచే ఈ యాప్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. రవి ఉప్పల్‌ను ఇండియాకు తీసుకొచ్చాక మిగతా విషయాలు వెల్లడిస్తామని ఈడీ అధికారులు చెప్తున్నారు.