Vishal: నువ్వు కోర్టు కంటే తోపా.. జడ్జి చీవాట్లు
ప్రముఖ నటుడు విశాల్‌కు (vishal) మద్రాస్ హైకోర్టు (madras high court) న్యాయమూర్తి చీవాట్లు పెట్టారు. నువ్వు కోర్టు కంటే తోపా అంటూ మండిపడ్డారు. మ్యాటర్ ఏంటంటే.. కొంతకాలం క్రితం విశాల్ గోపురం ఫిలింస్ సంస్థ యజమాని అన్బు చెళియన్ నుంచి దాదాపు రూ.21 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. దానిని చెల్లించలేకపోవడంతో.. లైకా సంస్థ (lyca productions) సాయం తీసుకున్నాడు. లైకా సంస్థలకు త్వరలో డబ్బులు చెల్లించేస్తానని చెప్పి వారి ద్వారా అన్బు నుంచి తీసుకున్న అప్పును తీర్చేసాడు. అటు లైకా సంస్థకు కూడా విశాల్ అప్పు చెల్లించలేకపోయాడు. దాంతో లైకా మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది.
దాంతో హైకోర్టు రూ.15 కోట్లు ముందు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తన దగ్గర రూ.15 కోట్లు క్యాష్ కానీ అంత విలువ చేసే ఆస్తులు కానీ లేవని కోర్టుకు తెలిపాడు. దాంతో కోర్టు విశాల్‌ను తన వద్ద ఉన్న ఆస్తులకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. విశాల్ అది కూడా చేయకపోవడంతో.. ఈరోజు కోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఈ కేసును పరిశీలిస్తున్న జడ్జి ఆశా.. విశాల్ వైపు చూస్తూ.. మీరు కోర్టు కంటే తోపు అనుకుంటున్నారా అని మండిపడ్డారు. (vishal)