Madhya Pradesh: లంచం తీసుకుంటూ దొరికిపోయి.. ఏం చేసాడో తెలుసా?
Madhya Pradesh: ఓ అధికారి లంచం (bribe) తీసుకుంటూ దొరికిపోయాడు. కానీ ఎక్కడ ఏసీబీ వాళ్లు డబ్బు పట్టేసుకుంటారో అని భయపడి తీసుకున్న నోట్లను వారి ముందే మింగేసాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో (madhya pradesh) చోటుచేసుకుంది. గజేంద్ర సింగ్ అనే వ్యక్తి జబల్‌పూర్‌లో రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అధికారిగా పనిచేస్తున్నాడు. ఇతనికి చేతి వాటం ఎంత ఉందంటే.. రూ.500కి అయిపోయే పనులకు కూడా వేలల్లో లంచాలు తీసుకుంటాడట. దాంతో కొందరు బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దాంతో ఏసీబీ అధికారులు ఒక ప్లాన్ వేసారు. ఓ వ్యక్తిని పంపించి ఫైల మీద సంతకం చేయాలని రిక్వెస్ట్ చేయాలి అన్నట్లు చెప్పించారు. అతను లంచం అడుగుతాడు అని తెలుసు కాబట్టి ముందే అక్కడికి బాధితుల గెటప్‌లో చేరుకున్నారు.
అధికారులు ఊహించినట్లుగానే గజేంద్ర సింగ్ రూ.5000 ఇస్తే పని అవుతుంది అని దబాయించాడు. ముందుగా వేసిన ప్లానే కావడంతో ఆ బాధితుడు తన దగ్గర ఉన్న రూ.5000 తీసి ఇస్తుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే ఎక్కడ దొరికిపోతానో అని ఆ నోట్లను గజేంద్ర నమిలి మింగేసాడు. దాంతో వెంటనే దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. గజేంద్ర ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పాక అతన్ని అదుపులోకి తీసుకున్నారు.