Madan Mohan: పార్ల‌మెంట్ ఎదుట‌ శాంతి భ‌ర్త ధ‌ర్నా

madan mohan dharna in front of parliament

Madan Mohan: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శాంతి భ‌ర్త మ‌ద‌న్ మోహ‌న్ ఢిల్లీలోని పార్ల‌మెంట్ ఎదుట ధ‌ర్నాకు దిగారు. తాను ఇంత‌గా మీడియా ముందుకు వ‌చ్చి త‌న బాధ‌ను చెప్పుకుంటున్నా విజ‌య సాయిరెడ్డి ప‌ట్టించుకోకుండా వేరే వాళ్ల చేత ఫోన్లు చేయించి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని.. త‌న‌కు త‌న పిల్ల‌ల‌కు న్యాయం చేయ‌క‌పోతే ఈ ధ‌ర్నా మాత్రం ఆగ‌ద‌ని అన్నారు. రాజ్యస‌భ ఛైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్క‌డ్‌తో పాటు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును క‌లిసి త‌న ద‌గ్గ‌ర ఉన్న అన్ని ఆధారాల‌ను చూపించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ విష‌యంలో త‌న‌కు న్యాయం జ‌ర‌గక‌పోతే తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు త‌ల దించుకోవాల్సి వ‌స్తుంద‌ని అన్నారు.