Lokmanya Tilak Express: లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ మంటలు

Chennai: లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో (lokmanya tilak express) భారీ మంటలు చెల‌రేగాయి. చెన్నై నుంచి బేసిన్ బ్రిడ్జి సమీపంలో ప్ర‌యాణిస్తున్న‌ లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు చెల‌రేగ‌డంతో ప్ర‌యాణికులు భయాందోళనకు గుర‌య్యారు. భ‌యంతో కోచ్‌ల‌లో నుంచి బ‌య‌టికి దూకి ప‌రుగులు తీసారు. పెనుప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే శాఖ సిబ్బంది మంట‌ల‌ను అదుపుచేసారు.