గచ్చిబౌలిలో దారుణ హత్య.. లైవ్ వీడియో వైర‌ల్

live murder in Gachibowli

Gachibowli: హైద‌రాబాద్‌లోని గచ్చిబౌలిలో ఒళ్లుగ‌గుర్పొడిచే ఘ‌ట‌న చోటుచేసుకుంది. గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో హోటల్ యజమాని శ్రీనివాస్ (54) త‌న హోట‌ల్‌లో కూర్చుని ఉండ‌గా.. ఉన్న‌ట్టుండి ఓ వ్య‌క్తి ఇనుప రాడ్‌తో దాడి చేసాడు. అక్క‌డే ఉన్న‌వారు గ్ర‌హించి అత‌న్ని ప‌ట్టుకునే లోపు రెండుసార్లు గ‌ట్టిగా త‌ల‌పై కొట్ట‌డంతో ఉన్నచోటే మృతిచెందాడు. ఈ ఘ‌ట‌న అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దుండ‌గుడు ఎవ‌రు ఎందుకు దాడి చేసాడు వంటి వివ‌రాలు తెలియాల్సి ఉంది.