Interview: ఇంటర్వ్యూలో గెలవనివ్వని “నవ్వు”
Interview: ఇంటర్వ్యూకి వెళ్లే సమయంలో నీట్‌గా డ్రెస్సింగ్ ఉండాలని.. కాన్ఫిడెంట్‌గా ఉండాలని చెప్తుంటారు. ఇవి బయటికి కనిపించే అంశాలు. ఇక నైపుణ్యాలు అనేవి రెండో అంశం. అంటే ముందు మన అప్పియరెన్స్ చూసే హెచ్ఆర్లు, హైరింగ్ మేనేజర్లు మనం ఎలాంటివాళ్లమో డిసైడ్ చేసేస్తుంటారన్నమాట. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఇదే తంతు నడుస్తోంది. ఎదుటి వాడికి నైపుణ్యాలు ఉన్నాయా లేవా అని చూడకుండా.. వాడు వేసుకున్న ప్యాంట్‌కి ఇస్త్రీ ఉందా.. అమ్మాయి కుర్తీ పొడుగ్గా ఉందా.. నవ్వు ఎలా ఉంది.. ఇలాంటి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఈ విషయాన్ని ఓ వ్యక్తి లింక్డిన్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారుతోంది.
ఆ వ్యక్తి సోదరుడు ఓ టాప్ కార్పొరేట్ కంపెనీలో హైరింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడట. అతను ఇంటర్వ్యూ చేసిన చాలా మంది అభ్యర్ధులు పళ్లన్నీ కనిపించేలా నవ్వడం.. షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు మరీ గట్టిగా నొక్కేయడం.. ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చాలా మందిని రిజెక్ట్ చేసాడట. ఈ విషయంపై లింక్డిన్లో పెద్ద చర్చే జరుగుతోంది. చాలా మంది తమకు ఎదురైన ఇంటర్వ్యూ అనుభవాలను వ్యక్తపరుస్తున్నారు.