Kamareddy: ఎక్కడపడితే అక్కడ తాకుతున్నాడు.. వైద్యాధికారి నీతిమాలిన చర్య
Kamareddy: కామారెడ్డికి చెందిన ఓ వైద్యాధికారిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శితో పాటు, కలెక్టర్కు 21 మంది పీహెచ్సీల మహిళా మెడికల్ ఆఫీసర్లు ఫిర్యాదులు చేసారు. ఏడాదిన్నర కాలంగా తమతో అనుచితమైన పదాలతో మాట్లాడుతూ శరీర భాగాలను తాకుతున్నాడని… పీహెచ్సీలను సందర్శించినప్పుడు మహిళా వైద్యులు, సిబ్బందిని పక్కన కూర్చోవాలని చెబుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిఘటిస్తే గట్టిగా అరిచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసారు.
ఫోన్లో వైవాహిక స్థితిగతులను అడిగి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని.. తమ చాంబర్లో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీన జరిగిన విస్తృత సేవల శిక్షణ కార్యక్రమంలో అకస్మాత్తుగా వచ్చి మహిళా వైద్యులు, సిబ్బంది వ్యభిచారిణులుగా పనిచేస్తున్నారని గట్టిగా కేకలు వేసాడట. దాంతో సాక్ష్యాలతో సహ కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.