Kusal Mendis: విరాట్‌కి నేనెందుకు కంగ్రాట్స్ చెప్పాలి?
World Cup 2023: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (virat kohli) నిన్న తన 35వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ సెంచరీల రికార్డు కూడా సమం చేసాడు. దాంతో ప్రపంచం నలుమూలల నుంచి విరాట్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. అయితే ఇదే విషయం గురించి శ్రీలంక క్రికెటర్ కుసాల్ మెండిస్‌ని (kusal mendis) ప్రశ్నించగా అతను దురుసుగా సమాధానం ఇచ్చాడు. అసలు నేనెందుకు విరాట్ కోహ్లీకి కంగ్రాట్స్ చెప్పాలి అని ఎదురు ప్రశ్న వేసారు.
మీడియా వర్గాలు కుసాల్ మెండిస్ నుంచి ఇలాంటి రిప్లైను మాత్రం అస్సలు ఊహించలేదు. దాయాది దేశం అయిన పాకిస్థాన్ క్రికెటర్లు కూడా విరాట్‌కి ఫ్యాన్సే. అలాంటివారే విరాట్ నుంచి సంతకం చేసిన జెర్సీలు తీసుకుంటుంటే శ్రీలంక క్రికెటర్ మాత్రం ఇలా మాట్లాడటం ఎంత వరకు సబబో వారే ఆలోచించుకోవాలి. ఈరోజు శ్రీలంక బాంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుంది. అయితే భారత్ చేతిలో శ్రీలంక ఓడిపోవడంతో ఆ దేశ క్రికెట్ బోర్డును రద్దు చేసింది. ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యదర్శి రాజీనామా చేసారు. శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున్ రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటుచేయనున్నారు.