Snake: బ‌తికున్న పాముని ఆర‌గించేసింది

korean woman eats live snake

Snake: ఓ యువ‌తి బ‌తికున్న పామునే మాంసాహారం తింటున్న‌ట్లు ఆర‌గించేసింది. ఈ వికృత ఘ‌ట‌న సౌత్ కొరియాలో చోటుచేసుకుంది. ఓ యువ‌తి టేబుల్‌పై కూర్చుని ఉండ‌గా ఆమె ముందు ప్లేట్‌లో ఆకుకూర‌లు, బ‌తికున్న పాములు పెట్టారు. అదేదో చికెన్, మ‌ట‌న్ తెచ్చిపెట్టారు అన్న‌ట్లు ఆ యువ‌తి ఒక్కో పామును ప‌ట్టుకుని కొరికి ఆస్వాదిస్తూ తినేసింది. మ‌ధ్య‌లో ఆకుకూర‌ల‌ను మంచింగ్‌గా నంజుకుని తినేసింది. ఆ స‌మ‌యంలో తీసిన వీడియోను సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేయ‌డంతో నెటిజ‌న్లు వాంతులు చేసుకుంటున్నారు. ఇలాంటివ‌న్నీ తిని మ‌ళ్లీ ఏం వైర‌స్ వ‌దులుతారు రా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చైనా, వియ‌త్నాంల‌లో పాముల‌ను కూడా ఆహారంలో భాగంగా చేర్చుకుంటారు.