Sachet Loans: ఇక G PAY ద్వారా లోన్ తీసుకోవచ్చు
టెక్ దిగ్గజం గూగుల్ (google) త్వరలో భారత్లో పిక్సెల్ ఫోన్లు (pixel phones) తయారీ చేస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించేసింది. దీనితో పాటు ఇక్కడే రీటైల్ బిజినెస్ కూడా ప్రారంభించనున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (sundar pichai) వెల్లడించారు. దీనిలో భాగంగా యూజర్లకు సాచే లోన్స్ (sachet loans) ఇవ్వనున్నట్లు తెలిపారు. అసలు ఈ సాచే లోన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం.
ఈ సాచే లోన్స్ చిన్న వ్యాపారుల కోసం ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం గూగుల్ వివిధ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC)లతో భాగస్వామ్యం అవుతుంది. సాచే అంటే చిన్న ప్యాకెట్ అని అర్థం. అంటే గూగుల్ ఈ సాచే లోన్స్ ద్వారా చిన్న మొత్తాల్లో చిన్న వ్యాపారుల కోసం లోన్లు ఇస్తుంది. వీటిని చెల్లించే సమయం కూడా తక్కువే ఉంటుంది. ప్రస్తుతానికైతే గూగుల్ పే ద్వారా ఢిల్లీకి చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన DMI ఫైనాన్స్ ద్వారా రూ.15000 వరకు లోన్లు ఇవ్వనుంది. దీనికి ఈఎంఐ కూడా నెలకు రూ.111 నుంచి మొదలవుతుంది.