Tirumala Laddoo: లడ్డూ తయారీకి మళ్లీ మా నెయ్యే.. సంతోషంగా ఉంది
Tirumala Laddoo: తిరుమల లడ్డూ తయారీలో చేప నూనె, జంతువుల కొవ్వు వాడుతున్నారన్న అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు శ్రీవారికి పెట్టే నైవేధ్యాలు, కైంకర్యాల విషయంలో కల్తీ జరిగిందని తిరుమల తిరుపతి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో మళ్లీ తిరుమల లడ్డూ తయారీకి ఎన్నో ఏళ్లుగా వాడుతున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు (KMF) చెందిన నందిని నెయ్యినే వినియోగిస్తున్నారు. ఈ కల్తీ అంశంపై మిల్క్ ఫెడరేషన్ అధికారులు స్పందించారు. 2023లో KMF కిలో నెయ్యి 400 రూపాలయకు అమ్మేది. అంతకంటే తక్కువ రేట్లకు టెండర్లకు పిలుస్తుంటే తాము పాల్గొనమని తేల్చి చెప్పేసారు.
“” కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతి లడ్డూకి వాడే నెయ్యి అంశంపై ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు నందిని నెయ్యిని వాడటం లేదు అని ప్రశ్నించారు. మాకు వారి నుంచి నోటీసులు రావడంతో మళ్లీ తిరుమలకు నందిని నెయ్యినే సప్లై చేస్తున్నాం. కొన్ని రోజుల క్రితమే ఒక ట్యాంకర్ నెయ్యిని తిరుమలకు పంపాం. 2013 నుంచి 2018 వరకు తిరుమలకు 3000 నుంచి 4000 టన్నుల నెయ్యిని పంపించాం. 2019లో అత్యధికంగా 2000 టన్నులు పంపాం. ఆ తర్వాత టెండరింగ్ ప్రక్రియ సమయంలో ప్రైవేట్ కంపెనీ వారు అతి తక్కువ ధరలకే నెయ్యి ఇస్తామని రావడంతో మేం తక్కువ ధరలకు పాల్గొనలేకపోయాం. అలా టెండర్ వేరే కంపెనీకి వెళ్లింది. 27 లక్షల మంది రైతుల కష్టమే ఈ నందిని నెయ్యి. అలాంటి నెయ్యి మేం తిరుమలకు మాత్రమే కాదు దుబాయ్, కువైట్‌కి కూడా ఎగుమతి చేస్తుంటాం. “” అని KMF ఛైర్మన్ భీమా నాయక్ వెల్లడించారు.