North Korea: నీకేమన్నా సిగ్గున్నదారా..?
Hyderabad: కిమ్ (kim jong un) నియంత పాలన గురించి అందరికీ తెలిసిందే. నార్త్ కొరియాలో (north korea) మాత్రం అస్సలు పుట్టకూడదని కోరుకోని మనిషి ఉండడు. ఆ రేంజ్లో ఉంటుంది కిమ్ గారి పాలన. ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు. తను తన కుటుంబం బాగుండాలని కోరుకునే వ్యక్తి అతను. ఇప్పుడు నార్త్ కొరియాకు తీవ్ర తుఫాను పొంచి ఉంది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పాలకుడు.. ఏం జరిగినా సరే గాలుల వల్ల తన ఫొటోలకు మాత్రం ఏమీ కాకూడదని వార్నింగ్ ఇచ్చాడట. (north korea)
కిమ్ ఫొటోలు మాత్రమే కాదు.. అతని తండ్రివి, కూతురి ఫొటోలకు కూడా ఏమీ కాకుండా చూసుకోవాలని కిమ్ న్యూస్పేపర్లో ప్రకటన వేయించాడు. పొరపాటున తనకు, తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫొటోలు, విగ్రహాలకు కానీ ఏమైనా జరిగితే వారిని ఉరితీయాలని ఆదేశాలు జారీ చేసాడు కిమ్. (kim jong un)