Rameswaram Cafe Blast: కేసు దర్యాప్తులో కీలక పరిణామం
Rameswaram Cafe Blast: బెంగళూర్‌లో బాంబ్ పేలుడుతో కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రద్దీగా ఉండే రామేశ్వరం కేఫ్ వద్ద శుక్రవారం పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. అయితే బాంబ్ పెట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఆధారంగా దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బాంబ్ పెట్టారని వివరించారు.
బెంగళూర్‌లో బాంబ్ పేలుడుతో కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రద్దీగా ఉండే రామేశ్వరం కేఫ్ వద్ద పేలుడు జరిగింది. పేలుడుకు గల కారణాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. బాంబ్ పెట్టిన వ్యక్తిని సీసీ టీవీ ఆధారంగా గుర్తించారు. దక్షిణ కన్నడకు చెందినవాడని చెబుతున్నారు. పేలుడుకు సంబంధించి మరో వ్యక్తిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిందితుడు మొహం గుర్తించే పనిలో ఉన్నారు.
నిందితుడు బస్సులో రామేశ్వరం కేఫ్ వద్దకు వచ్చాడు. ఫుడ్ కౌంటర్ వద్ద కూపన్ తీసుకొని డైనింగ్ ప్రాంతానికి వెళ్లాడు. ఆర్డర్ చేసిన ఫుడ్ మాత్రం తినలేదు. డైనింగ్ ప్రాంతం దగ్గరలో బ్యాగ్ వదిలేసి వెళ్లిపోయాడు. అతను రెస్టారెంట్ నుంచి వెళ్లిపోయిన తర్వాత బాంబ్ పేలింది. పేలుడుతో 10 మంది వరకు గాయపడ్డారు. బాంబ్ పేలుడు ఘటనపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. బాంబ్ పేలుడు ఘటనకు సంబంధించి ఊహాగానాలను ప్రచారం చేయొద్దని మీడియాను బెంగళూర్ పోలీసు కమీషనర్ కోరారు. (Rameswaram Cafe Blast)
ఈ ఘటన అనంతరం కేఫ్ ఓ ప్రకటన విడుదల చేసి విచారణలో అధికారులకు సహకరిస్తామని తెలిపింది. రామేశ్వరం కేఫ్ యజమానులుగా రాఘవేంద్రరావు, దివ్య రాఘవేంద్రరావు ఉన్నారు. ఆ క్రమంలో క్షతగాత్రులకు సహాయాన్ని అందజేస్తున్నట్లు కేఫ్ కో-ఫౌండర్ దివ్య రాఘవేంద్రరావు తెలిపారు. క్షతగాత్రులకు వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. తాము అన్ని సహాయ, సహాకారాలు అందిస్తామని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
నిత్యం రద్దీగా ఉండే కేఫ్
రాఘవేంద్రరావు మరియు దివ్య సంయుక్తంగా 2021లో బెంగళూరులోని ఇందిరానగర్‌లో రామేశ్వరం కేఫ్ ని ప్రారంభించారు. వారు తమ దుకాణానికి దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరును ఆయన స్వస్థలం రామేశ్వరం పేరు పెట్టారు. రాఘవేంద్రరావుకు ఆహార పరిశ్రమలో 15 సంవత్సరాల అనుభవం ఉంది మరియు దివ్య ఐఐఎం అహ్మదాబాద్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్. అంతే కాకుండా సీఏ పూర్తి చేశారు. ఇద్దరూ కలిసి 2021లో తమ మొదటి స్టోర్‌ని ప్రారంభించారు.
సంప్రదాయ దక్షిణ భారత వంటకాలను అందజేస్తుండటంతో వారి కేఫ్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కేఫ్ ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇక్కడ వడ్డించే నెయ్యి కారప్పొడి ఇడ్లీ మరియు మసాలా దోస, లెమన్ ఇడ్లీలకు కస్టమర్లు క్యూ కడతారు. ఈ దుకాణంలో నెలకు 4.5 కోట్లు మరియు సంవత్సరానికి 50 కోట్లు. అంతే కాకుండా దాదాపు 200 మందికి ఉపాధి కల్పించారు. త్వరలో బెంగళూరులోని ఇతర ప్రాంతాలలో మరియు భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో స్టోర్లను ప్రారంభించి, కొత్త వంటకాలను పరిచయం చేస్తామని ఈ జంట చెప్పారు. ఇటీవల, ప్రముఖ టీవీ షో మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా న్యాయనిర్ణేతలలో ఒకరైన చెఫ్ గ్యారీ మీహన్ బెంగళూరును సందర్శించారు. ఆ తర్వాత ఈ కేఫ్కి వచ్చి దోసె తిన్నాక వీడియో పోస్ట్ చేశాడు. దీంతో ఈ కేఫ్ మరింత ప్రజాదరణ పొందింది.