Tirumala: లడ్డూ ప్రసాదం విషయంలో TTD కీలక నిర్ణయం
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వరకు భక్తులకు టికెట్లు ఉంటేనే లడ్డూ ప్రసాదం లభించేది. దర్శన టోకెన్లు, టికెట్లు లేని వారికి అదనంగా లడ్డూ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఈ ప్రక్రియలో మార్పులు చేసారు. దర్శన టోకెన్లు, టికెట్లు లేకపోతే ఆధార్ కార్డుతో రెండు ఉచిత లడ్డూలు, దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్నవారికి ఒక ఉచిత లడ్డూతో పాటు గతంలో మాదిరిగా అదనంగా ఎన్నైనా కొనుక్కోవచ్చు.
గతంలో కొందరు మధ్యవర్తులు, దళారులు దర్శన టికెట్లు లేకుండా కేవలం లడ్డూలు కొనుగోలు చేసి ఆ లడ్డూలను అధిక ధరలకు అమ్ముకునేవారని తమ దృష్టికి వచ్చినట్లు TTD AEO వెంకయ్య చౌదరి తెలిపారు. వీటిని అరికట్టేందుకు ఇకపై రోజూవారి టోకెన్లు, టికెట్లు లేని ప్రతి భక్తునికి ఆధార్ కార్డుపై రెండు లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.