డ్ర‌గ్ డీలర్ తెలివి.. పోలీస్‌ని మాత్ర‌మే క‌రిచేలా కుక్క‌ల‌కు ట్రైనింగ్

కేర‌ళ‌కు (kerala) చెందిన ఓ డ్ర‌గ్ డీల‌ర్ పోలీసుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి చావు తెలివితేట‌లు వాడాడు. త‌న ఇంట్లో పెంచుకుంటున్న కుక్క‌ల‌కు (dogs) కూడా ఒక ర‌క‌మైన డ్ర‌గ్స్ అల‌వాటు చేసి పోలీస్ దుస్తుల్లో ఎవ‌రు క‌నిపించినా కొరికి చంపేసేలా ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ విష‌యం కేర‌ళ నార్కోటిక్స్ బ్యూరో అధికారుల‌కు తెలిక అత‌ని ఇంటిపై రెయిడ్స్ చేసేందుకు పోలీసుల‌తో వెళ్లారు. దాంతో కుక్కలు వారి వెంట‌ప‌డ్డాయి. దాదాపు అర‌గంట పాటు క‌ష్ట‌ప‌డి కుక్క‌ల‌కు మ‌త్తుమందు ఇచ్చి మ‌రీ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అత‌ని ఇంట్లో 17 కిలోల గంజాయిని ప‌ట్టుకున్నారు.