మ‌న యువ‌తి యెమెన్ వాసిని ఎందుకు చంపింది.. ఉరిశిక్ష ఎందుకు ప‌డింది?

Kerala: కేర‌ళ‌కు చెందిన ఓ న‌ర్సుకి యెమెన్ (yemen) దేశంలో ఉరిశిక్ష ప‌డింది. ఉరిశిక్షను ర‌ద్దు చేయ‌మ‌ని మ‌న ప్ర‌భుత్వం ప్ర‌యత్నిస్తున్న‌ప్ప‌టికీ ఆ దేశం జాలి చూపించ‌డం లేదు. ఇందుకు కార‌ణం కేర‌ళ యువ‌తి యెమెన్ దేశ‌స్థుడిని చంప‌డ‌మే.

అస‌లు ఏం జ‌రిగింది?

కేర‌ళ‌కు చెందిన నిమీషా అనే యువ‌తి యెమెన్‌లో న‌ర్సుగా ప‌నిచేస్తోంది. 2017లో నిమీషా యెమెన్‌కు వెళ్లింది. అయితే అక్క‌డ జీవించడం చాలా క‌ష్టం. ఇత‌ర దేశాల‌కు చెందిన‌వారు అక్క‌డికి ప‌నికి వ‌స్తే ముందు వారి నుంచి పాస్‌పోర్టులు తీసుకుంటారు. ఇది అక్క‌డి రూల్. అయితే వారు మంచివారైతే ఫ‌ర్వాలేదు కానీ పాస్‌పోర్ట్ లాక్కుని ఆడ‌వాళ్ల చేత త‌ప్పుడు ప‌నులు చేయించ‌డం వారిని టార్చ‌ర్ పెట్ట‌డం వంటివి చేస్తేనే స‌మ‌స్య‌.

అయితే నిమీషాకు ఈ స‌మ‌స్య ఎదురైందో లేక ఆమెకు అక్క‌డ ప‌నిచేయ‌డం ఇష్టం లేక తిరిగి కేర‌ళ‌కు వ‌చ్చేయాల‌నుకుందో తెలీలేదు కానీ.. త‌న‌కు త‌న పాస్‌పోర్ట్ కావాల‌ని య‌జ‌మాని మ‌హ్దీని అడిగింది. ఇందుకు అత‌ను ఒప్పుకోలేదు. ఎలాగైనా త‌న పాస్‌పోర్ట్ తీసుకుని పారిపోవాల‌ని అనుకుంది. ఈనేప‌థ్యంలో అత‌నికి విష‌పూరిత‌మైన ఇన్‌జెక్ష‌న్లు ఇచ్చి చంపేసింది. దాంతో యెమెన్ దేశం నిమీషాకు ఉరిశిక్ష విధించింది. (kerala)

2017 నుంచి నిమీషా యెమెన్ జైలులో శిక్ష అనుభ‌విస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆమె త‌ల్లి భార‌త ప్ర‌భుత్వాన్ని సాయం కోరింది. తన కూతురికి ఉరిశిక్షను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ భార‌త ప్ర‌భుత్వం ద్వారా యెమెన్‌లోని సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేయించింది. అయితే ఆ పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. క‌నీసం త‌న‌ను యెమెన్‌కు పంపించి త‌న కూతురిని చూసుకోనివ్వండి అంటూ వేడుకుంది. కావాలంటే చ‌నిపోయిన మ‌హ్దీ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి కేసు కొట్టివేసేలా చూడాల‌ని కోరింది. అయితే యెమెన్‌లో ప్ర‌స్తుతం యుద్ధ ప‌రిస్థితులు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌తీయుల‌ని కానీ ఇత‌ర విదేశీయుల‌ను కానీ అక్క‌డికి రానివ్వ‌డంలేదు.

అయితే కేర‌ళ హైకోర్టు ఆర్థిక సాయం ప్ర‌క‌టించి నిమీషను విడిపించేందుకు కేంద్రానికి ఎలాంటి అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కేవ‌లం ఆమెకు ప‌డిన ఉరిశిక్ష‌ను ర‌ద్దు చేయించేలా ఉపాయం ఆలోచించాల‌ని మాత్ర‌మే కోరింది. 2022లో సేవ్ నిమీషా అనే పిటిష‌న్‌ను కేర‌ళ హైకోర్టులో వేసారు. అప్ప‌టినుంచి వాద‌న‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌గా భార‌త ప్ర‌భుత్వం యెమెన్ న్యాయ‌స్థానంతో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌క‌పోతే 2024లో నిమీష‌కు ఉరిశిక్ష ప‌డే అవ‌కాశం ఉంది.  (kerala)