Kerala: ప్రియుడితో కూతుర్ని రేప్ చేయించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష
Kerala: అమ్మతనానికే మచ్చ తెచ్చిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. కన్న బిడ్డలను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన ఓ కసాయి తల్లే మరో వ్యక్తి చేత దారుణంగా రేప్ చేయించింది. ఈ ఘటన మార్చి 2018 నుంచి 2019 మధ్యలో చోటుచేసుకుంది. ఆ మహిళ తన భర్తతో ఇద్దరు పిల్లల్ని కని.. అతని మానసిక పరిస్థితి బాలేదని వదిలేసి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అప్పుడప్పుడూ తన మైనర్ కూతుర్ని తన ప్రియుడి ఇంటికి తీసుకెళ్లేది. అంతటితో ఆగకుండా తన ప్రియుడి చేత కూతుర్ని రేప్ చేయించింది. ఆ రాక్షసుడు బాలికను ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ దారుణంగా కొట్టేవాడు.
ఓసారి ఆ బాలిక సోదరి ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు జరిగినదంతా చెప్పింది. ఆంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఇలాంటి వారికి వెంటనే శిక్ష పడేలా చేయాలన్న ఉద్దేశంతో ఓ న్యాయవాది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పిటిషన్ వేసాడు. వాదోపవాదాలు విన్నాక ఈ దారుణానికి ఒడిగట్టిన కసాయి తల్లికి కోర్టు 40 ఏళ్ల యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. అయితే ఆ మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి కేసు విచారణలో ఉండగానే ఆత్మహత్యకు చేసుకోవడం గమనార్హం.