Kavya Karnatac: పెళ్లికి రమ్మని అంబానీలు డబ్బిచ్చారు.. నేను ఒప్పుకోలేదు
Kavya Karnatac: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి వేడుకల్లో అనంత్, రాధికా మర్చెంట్‌ల వివాహ వేడుక ఒకటి. దాదాపు మూడు నెలల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుక కోసం ముఖేష్, నీతా అంబానీ దంపతులు ఏకంగా రూ.5000 కోట్లు ఖర్చుపెట్టారు. అయితే ఈ పెళ్లికి ప్రపంచ దేశాలకు చెందిన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కూడా హాజరయ్యారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే.. వారందరికీ అంబానీల గురించి వార్తల్లో వినడమే తెలుసు కానీ వ్యక్తిగత పరిచయాలు లేవు. దాంతో అంబానీలు చాలా మంది సెలబ్రిటీలకు కోట్లు ఇచ్చి మరీ తమ పెళ్లికి ఆహ్వానించుకున్నారు. మనకు పెళ్లిలో కనిపించిన దాదాపు అందరు సెలబ్రిటీలకు అంబానీలు కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి మరీ పిలిపించారు.
అయితే పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయికి కూడా అంబానీలు డబ్బు ఇచ్చి తమ ఇంటి పెళ్లికి వచ్చి ప్రమోషన్స్ చేయాలని కోరారట. ఆ అమ్మాయి పేరు కావ్యా కర్నాటిక్. ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. కాకపోతే ఈమెకు అంత ఫాలోయింగ్ లేదు కాబట్టి రూ.3.6 లక్షలు ఇచ్చి పెళ్లికి హాజరవ్వాలని ఆహ్వానం పంపారట. కానీ కావ్య ఆ ఆహ్వానాన్ని తిరస్కరించింది. తానెందుకు తిరస్కరించానో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఓ పక్క పెళ్లి జరుగుతున్న నేపథ్యంలో జియో రీచార్జ్‌ల ధరలు పెరిగాయి. దాంతో తాను వారి పెళ్లికి వెళ్తే ఆ రీచార్జ్ ధరలను పెంచడాన్ని సమర్ధిస్తున్నట్లు అవుతుందని తెలిపింది. ఇక రెండో కారణం ఏంటంటే.. తాను చాలా నిజాయతీ అంశాలపై వీడియోలు, ప్రమోషన్స్ చేస్తుంటానని.. అలాంటిది అంబానీలు పిలిచారని వెళ్తే ఎక్కడ తనకున్న ఫాలోవర్లు తనను డబ్బుకు అమ్ముడుపోయింది అనుకుంటారో అని వెళ్లలేదని వెల్లడించింది.