Darshan: షాకింగ్ ట్విస్ట్.. ద‌ర్శ‌న్ ఫాంహౌస్ మేనేజ‌ర్ అనుమానాస్ప‌ద మృతి

kannada actor darshan farm house manager found dead

Darshan: క‌న్నడ న‌టుడు ద‌ర్శ‌న్ త‌న అభిమాని రేణుకా స్వామిని హ‌త్య చేసిన కేసులో మ‌రో ట్విస్ట్ బ‌య‌ట‌ప‌డింది. దర్శ‌న్ ఫామ్ హౌజ్‌లో మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్న వ్య‌క్తి అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందాడు. ద‌ర్శ‌న్‌కు బెంగ‌ళూరులో ఓ ఫామ్‌హౌజ్ ఉంది. ఆ ఫామ్ హౌజ్‌లో శ్రీధ‌ర్ అనే వ్య‌క్తి మేనేజ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ద‌ర్శ‌న్ హ‌త్య కేసులో అరెస్ట్ అయిన నేప‌థ్యంలో శ్రీధ‌ర్ సూసైడ్ లెట‌ర్ రాసి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

కొంత‌కాలంగా తాను ఒంట‌రిత‌నంతో పోరాడుతున్నాడ‌ని.. ఆ ఒంట‌రిత‌నాన్ని భరించ‌లేక చ‌నిపోతున్నాన‌ని శ్రీధ‌ర్ లేఖ‌లో రాసాడు. ఈ నేప‌థ్యంలో బెంగ‌ళూరు పోలీసులు రేణుకా స్వామి హ‌త్య‌కు శ్రీధ‌ర్‌కు ఏమ‌న్నా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేప‌డుతున్నారు.