Kadambari Jethwani: నాకు డబ్బు వద్దు.. డబ్బు నా గాయాలను మాన్పించదు
అనితను కలిసాక కాదంబరి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం తన గోడు విని వెంటనే స్పందించినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తాను తన కుటుంబం ఆంధ్రప్రదేశ్ నుంచి న్యాయంతో, మంచి జ్ఞాపకాలతో ముంబై వెళ్లాలనుకుంటున్నామని అన్నారు. ఎంత వీలైతే అంత త్వరగా తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే తనను మీడియా వర్గాలు పరిహారం ఎంత అడిగారు అని ప్రశ్నిస్తున్నారని.. తనకు పరిహారం అవసరం లేదని అన్నారు. తాను, తన కుటుంబం పడిన బాధలను ఎంత పరిహారం ఇచ్చినా గాయాలను ఆ డబ్బు మాన్పించదు అని అన్నారు.