పోర్న్‌కి అలవాటు పడిన భార్య.. జడ్జి సంచలన తీర్పు
Court: ఓ కోర్టు భార్య చేతిలో భర్త నలిగిపోవడాన్ని చూసి జడ్జి చలించిపోయాడు. విడాకులు మంజూరు చేస్తూ అతనికి మరో జీవితాన్ని ప్రసాదించాడు. పంజాబ్, హర్యాణా హైకోర్టుకి ఆరేళ్ల క్రితం విడాకుల కేసు వచ్చింది. ఆరేళ్ల పాటు ఈ కేసు నానుతూనే ఉంది. కేసు పెట్టింది భర్త. నిందితురాలిగా తన భార్యను చేర్చాడు. తనకు త్వరగా విడాకులు ఇప్పించాలని కోరాడు.
అతను పిటిషన్‌లో భార్యపై చేసిన ఆరోపణలు ఇవి
పోర్న్ ఎక్కువగా చూస్తూ ఉంటుంది
కలయిక సమయంలో టార్చర్ పెడుతూ నువ్వు చేతకాని వాడివి హిజ్రావి అని అవమానిస్తుంది
ఒంట్లో బాలేని నా తల్లిని నోటికొచ్చినట్లు తిడుతుంది. ఆమె గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటే అన్నం కోసం పై ఫ్లోర్‌కి నడుచుకుంటూ రావాలని డిమాండ్ చేస్తుంది
మరో వ్యక్తిని పెళ్లాడతాను అని బెదిరిస్తోంది
ఈ విషయాలన్నీ పిటిషన్‌లో పేర్కొంటూ కేసు వేస్తే.. వాదోపవాదాలు, కౌన్సిలింగ్ అంటూ ఆరేళ్లు గడిచిపోయాయి. ఈ ఆరేళ్లలో వారు ఒక్కసారి కూడా కలుసుకుని మాట్లాడలేదు. దాంతో ఈరోజు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. “” పెళ్లంటే పరస్పర గౌరవ, మర్యాదలు ఉండాలి. భర్తనే కాదు ఎవర్ని కూడా హిజ్రా అని వెక్కిరించకూడదు. ఇక మీరు కలిసి ఉండరు అని అర్థమైంది కాబట్టి విడాకులు మంజూరు చేస్తున్నా “” అని తీర్పులో పేర్కొన్నారు.