8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడిని వదిలేసిన జడ్జి
Viral News: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని కఠిన కారాగార శిక్ష వేయకుండా ఓ జడ్జి వదిలేసాడు. ఆ జడ్జి వదిలేయడానికి ఓ షాకింగ్ కారణం కూడా ఉంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన 66 ఏళ్ల వృద్ధుడు. 2019 మార్చిలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసాడు. ఆ సమయంలో మూడో తరగతి చదవుతున్న బాలిక తన ఇంటి దగ్గర్లోని ఓ ఆలయం సమీపంలో ఆడుకుంటుండగా.. విజయ్ అనే వ్యక్తి పాపను పక్కకు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పాప తన తల్లికి జరిగిన విషయం చెప్పింది. మిఠాయి ఇస్తానని చెప్పి పక్కకు తీసుకెళ్లి తన పట్ల ఎలా ప్రవర్తించాడో వివరించేసరికి ఆ తల్లి హతాశురాలైంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాదోపవాదాలు దాటుకుంటూ వారం రోజుల క్రితం ఈ కేసు బొంబాయ్ హైకోర్టుకు చేరింది. చివరి సారి వాదనలు విన్న జడ్జి తీర్పునిస్తూ.. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడాల్సిన అవసరం లేదని.. ఎందుకంటే అత్యాచారానికి గురై ఉంటే ఆ బాలిక భయంతో ఉండేదని కానీ ఆ భయం బాలికలో ఇసుమంతైనా కనిపించలేదు కాబట్టి ఇది శిక్షించాల్సిన నేరం కాదని అన్నారు. అంతేకాదు.. కావాలనే బాలిక తల్లి అత్యాచార ఆరోపణలు చేస్తూ డబ్బు కోసం కేసు వేసారని.. ఆ రోజు బాలికకు వడదెబ్బ తగిలి నీరసించిపోయిందే కానీ అత్యాచారం వల్ల కాదని తీర్పునిస్తూ నిందితుడిని నిర్దోషిగా ప్రకటించారు.