Japan: విమానానికి మంట‌లు.. ఐదుగురు దుర్మ‌రణం

Japan: జ‌పాన్ వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో అల్లాడిపోతోంది. ఇప్ప‌టికే భూకంపం కార‌ణంగా ఉక్కిరిబిక్కిరి అయిన జ‌పాన్.. ఈరోజు విమాన ప్ర‌మాద ఘ‌ట‌న కార‌ణంగా ద‌ద్ద‌రిల్లింది. జ‌పాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి మంట‌లు రావ‌డంతో ఐదుగురు దుర్మ‌రణం చెందారు. జ‌పాన్ కోస్ట్ గార్డ్ విమానం.. రన్‌వే పై ఆగి ఉన్న జ‌పాన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో కోస్ట్ గార్డ్ విమానం మంట‌ల్లో కాలిపోయింది. జ‌పాన్ ఎయిర్‌లైన్స్‌లో ఉన్న ప్ర‌యాణికుల‌ను సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు.