Corruption: ఓ పోలీస్ ఆవేదన..!
Jalandhar: పోలీసుల్లో కొందరు మంచివాళ్లు ఉంటారు కొందరు అవినీతి (corruption) పరులు ఉంటారు. ఆ అవినీతి పరుల కారణంగా నిజాయతీగా పనిచేసే పోలీసులు కూడా నష్టపోతున్నారు. ఇలాంటి ఘటనే పంజాబ్‌లో (punjab) చోటుచేసుకుంది. తన తోటి పోలీసులు చేస్తున్న అవినీతి పనులు నచ్చక ఓ పోలీసు (police) నడిరోడ్డుపై ధర్నా చేసాడు. అసలు ఏం జరిగిందంటే.. జలంధర్ ప్రాంతానికి చెందిన ఓ పోలీసు భోగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో హోం గార్డుగా పనిచేస్తున్నాడు. అతను దొంగలను, క్రిమినల్స్‌ను కష్టపడి పట్టుకుని స్టేషన్‌కు తీసుకొస్తుంటే.. తోటి పోలీసులు వారి నుంచి డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారట.
ఇలా ఒకసారి రెండుసార్లు అయితే చూసిచూడనట్లు ఉండచ్చు. కానీ ఎంత మందిని పట్టుకుంటే అంత మంది నుంచి డబ్బు తీసుకుని వదిలేస్తుంటే అతను భరించలేకపోయాడు. దాంతో ఈరోజు మధ్యాహ్నం నడిరోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేసారు. విషయం తెలుసుకుని స్థానిక మీడియా వర్గాలు వెళ్లి ఆరాతీసాయి. వారం రోజుల క్రితం ఓ క్రిమినల్‌ను పట్టుకుని జైల్లో వేసానని, రెండు రోజుల్లోనే అతన్ని రిలీజ్ చేసారని అతను వాపోయాడు. ఇదే విషయం స్టేషన్ హెడ్‌ను ప్రశ్నిస్తే.. ఆ క్రిమినల్‌కు బెయిల్ వచ్చింది కాబట్టి రిలీజ్ చేసామని, ఎలాంటి అవినీతి జరగలేదని చెప్తున్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పోలీసులు అతనికి నచ్చజెప్పి స్టేషన్‌కు తీసుకెళ్లారు. (corruption)