Valentine’s Day: జైల్లో విందు.. థింక్ డిఫరెంట్ గురూ..!
Valentine’s Day: వాలెంటైన్స్ డే దగ్గరలోనే ఉంది. రెండు మనసులు కలిసి ప్రేమలో మునిగిన ఇద్దరు మనుషులు జాలీగా జరుపుకునే డెస్టినేషన్. ఈ వాలెంటైన్స్ డే రోజున తమ భాగస్వాములతో జరుపుకోవడానికి ఈ ప్రత్యేక రోజు కోసం సిద్ధమవుతూ ఉంటారు. ఫిబ్రవరి అంటేనే ప్రేమికుల మాసం. మరి.. ఈ వాలంటైన్స్ డే రోజున ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే.. మీరు రొమాంటిక్ డేట్ కి ప్లాన్ చేసుకోవాలి. పర్యటనలకు ఈ నెలలో వాతావరణం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో కలిసి ఈ ప్రేమికుల రోజును జరుపుకునేందుకు ఒక మంచి ట్రిప్ ను ప్లాన్ చేయడం ఒక గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు.
అయితే , వాలెంటైన్స్ డేని కేవలం ప్రేమికులే గాక పెద్దల అంగీకారంతో చేసుకున్న జంటలు కూడా హ్యాపీగా చేసుకుంటారు. అంతేగాదు మనల్ని ఎంతగానో ప్రేమించే మన ఆత్మీయులు, స్నేహితులు కూడా ఆ రోజుని ఎంతగానో సెలబ్రెట్ చేసుకుంటారు. అయితే ఆ రోజు కచ్చితంగా చాలా మంది బయటే డిన్నర్ చేసేందుకు ప్లాన్‌లు చేస్తుంటారు. ఇది కామన్.. అయితే విలక్షణతను ఇష్టపడే వాళ్లు మర్చిపోలేని గుర్తులా ఉండేలా వెరైటీగా చేసుకునేందుకు ఆరాటపడుతుంటారు. అలాంటి వాళ్లు ఈ జైల్లోని ఖైదీల సెల్‌లో చేసుకోండి. అంతేగాదండోయ్! ప్రేమికుల రోజు సందర్భంగా విభిన్న రుచులతో కూడిన మెనూని కూడా ఈ జైలు అందిస్తోంది. ఖైదీలు ఉంచే సెల్‌లో డిన్నర్ చేస్తే ఎలా ఉంటుంది? అనే అనుభూతి కూడా పొందొచ్చు. ఎక్కడ? ఏ జైలు ఈ ఆఫర్ అందిస్తోందంటే..?
వివరాల్లోకెళ్తే.. యునైటెడ్ కింగ్‌డమ్‌లో, ఆక్స్‌ఫర్డ్ జైలు అని పిలవబడే పాత జైలు ఉంది. ఈ జైలు ప్రేమికులకు గొప్ప ఆఫర్ అందిస్తోంది. అదేంటంటే.. ఇది జంటల కోసం ప్రత్యేక వాలెంటైన్స్ డే విందును అందిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా సరదాగా సెల్‌లో డిన్నర్ చెసేలా వసతులు ఏర్పాటు చేసింది. పైగా అందుకోసం ప్రత్యేకమైన మూడు విధాన మెనూని కూడా ఏర్పాటుచేసింది. అంతేగాదు ఆ జైలులో ఖైదీలు ఉండే సెల్‌లో తినాలనుకుంటే సుమారు 17 వేల రూపాయాలు వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఘోరమైన హత్యానేరాలకు పాల్పడ్డ ఖైదీలసెల్‌లో తినాలనుకుంటే ఏకంగా 19 వేలు వరకు చెల్లించాల్సి ఉంటుంది. జైలు వెయ్యి సంవత్సరాల క్రితం యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, ఫిబ్రవరి 14న, సాధారణ జైలులో మీరు ఆశించే దానికంటే మెరుగైన ఆహారాన్ని వాగ్దానం చేసే ప్రత్యేక మెనుని అందజేస్తున్నారు.
ఈ జైల్లో భోజనం చేయడానికి వచ్చే అతిథుల కోసం క్యాండిల్స్, పువ్వులతో అలంకరించిన డైనింగ్ టేబుల్ ఆహ్వానం పలుకుతుంది. మాంసాహారుల కోసం బ్రైజ్డ్ బీఫ్ బ్లెడ్, షార్ట్ రిబ్ పిరోగి, వైన్ తదితర పానీయాలను అందిస్తారు. అలాగే శాకాహరలు కోసం టొమాటో టార్టేర్, కాల్చిన చీజ్ సౌఫిల్, బ్రైజ్డ్ క్యాబేజీ, చాక్లెట్, రాస్‌బెర్రీస్, పిస్తాతో డెకరేట్ సిన కేక్, కాక్‌టైల్ వంటి పానీయాలు కూడా ప్యాకేజ్‌లో ఉన్నాయి. ఇక్కడకు వచ్చే అతిథులు తమకు నచ్చిన ప్యాకేజ్‌ని ఎంపిక చేసుకోవచ్చని అని ఆక్స్‌ఫర్డ్ జైలు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. నిజానికి ఈ జైలు సుమారు వెయ్యి ఏళ్ల నాటి చారిత్రాత్మక కోట. 1073లో ఈ కోటని వైద్యశాలగా నిర్మించారు. అయితే 1642 నుంచి 1651ల మధ్య బ్రిటీషర్ల అంతర్యుద్ధం కారణంగా గణనీయమైన నష్టాన్ని ఎదుర్కొని 1786లో జైలుగా మార్చబడింది. అలా జైలుగా 1996 వరకు పనిచేసింది. ఆ తర్వాత ఆ ఆక్స్‌ఫర్డ్ జైలుని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చేశారు.