Biscuit: ప్యాకెట్‌లో ఒక్క బిస్కెట్ మిస్సింగ్.. ల‌క్ష జ‌రిమానా!

కొన్నిసార్లు చిన్న చిన్న త‌ప్పులే భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేస్తాయి అన‌డానికి ఈ ఘ‌ట‌నే నిద‌ర్శనం. బిస్కెట్ (biscuit) ప్యాకెట్‌లో ఒక బిస్కెట్ మిస్స‌వడంతో ఆ బిస్కెట్ త‌యారీ సంస్థ‌కు ఏకంగా ల‌క్ష జరిమానా విధించింది కోర్టు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది. మ‌థుర్ ప్రాంతానికి చెందిన బాబు అనే వ్య‌క్తి 2021 డిసెంబ‌ర్‌లో స‌న్‌ఫీస్ట్ బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేసాడు. అత‌ను కుక్క‌ల కోసమ‌ని రెండు బిస్కెట్ ప్యాకెట్లు కొన్నాడు. ఆ బిస్కెట్ ప్యాకెట్‌పైన 17 బిస్కెట్లు అని రాసుంది. కానీ ఒక ప్యాకెట్‌లో 16 బిస్కెట్లు మాత్ర‌మే ఉన్నాయి. పోనీలే అని లైట్ తీసుకోలేదు. వెంట‌నే క‌స్ట‌మ‌ర్ కేర్‌కు కాల్ చేసాడు. ఇంత చిన్న విష‌యానికి కంప్లైంట్ ఇవ్వాలా అని వాళ్లు లైట్ తీసుకున్నారు. (biscuit)

దాంతో బాబుకి ఒళ్లు మండింది. వెంట‌నే క‌న్య్సూమ‌ర్ కోర్టులో కేసు వేసాడు. ఈ సంస్థ బిస్కెట్ల‌ను ఎగ్గొట్టి రోజూ దాదాపు రూ.26 ల‌క్ష‌ల వ‌ర‌కు లాభం పొందుతోంద‌ని.. క‌స్ట‌మ‌ర్లు వారి వ‌ల్ల మోస‌పోతున్నార‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నాడు. దాంతో కోర్టు ఈ బిస్కెట్ త‌యారీ సంస్థ అయిన ITCకి నోటీసులు పంపింది.. దాంతో చ‌చ్చిన‌ట్లు వారు కోర్టుకి రావాల్సి వ‌చ్చింది. ITC త‌ర‌ఫు మేనేజ‌ర్ కోర్టుకు వివ‌ర‌ణ ఇస్తూ.. ఎన్ని బిస్కెట్లు ఉన్నాయి అనే లెక్క ఉండ‌ద‌ని..ఎన్ని గ్రాములు ఉన్నాయ‌నే ITC చూస్తుంద‌ని తెలిపారు. దాంతో ఎక్స్‌ప‌ర్ట్ చేత కోర్టు ప‌రీక్ష నిర్వ‌హించింది. ITC చెప్పినట్లు 17 గ్రాములు ఉండాల్సిన ప్యాకెట్ 15 గ్రాములే ఉంది. ఇలాంటి చిన్న చిన్న పొర‌పాట్ల వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు రావ‌ని రూల్స్‌లో రాసి ఉంద‌ని ITC కోర్టుకు తెలిపింది. అది విన్న న్యాయ‌మూర్తి.. ఈ రూల్స్ తినే వ‌స్తువుల‌కు వ‌ర్తించ‌వు అని చెప్పి.. క‌స్ట‌మ‌ర్ బాబుకి రూ.1 ల‌క్ష జ‌రిమానా చెల్లించాల‌ని తీర్పు ఇచ్చారు. (biscuit)