Chandrayaan 3: విక్ర‌మ్‌, ప్ర‌జ్ఞాన్‌ని నిద్ర‌లేపాల్సిన స‌మ‌యం

చంద్ర‌యాన్ 3 (chandrayaan 3) మిష‌న్‌లో భాగంగా ఇస్రో (isro) విక్ర‌మ్ ల్యాండ‌ర్ (vikram lander), ప్ర‌జ్ఞాన్ రోవ‌ర్‌ల‌ను (pragyan rover) 14 రోజుల పాటు స్లీప్ మోడ్‌లోకి పంపింది. ఇప్పుడు వాటిని తిరిగి నిద్ర‌లేపాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అవి ఎలాంటి స‌మ‌స్య లేకుండా సుదీర్ఘ నిద్ర నుంచి లేవ‌గ‌లిగితే.. ఇది మ‌రో చారిత్రాత్మ‌క ఘ‌ట్టం అవ‌తుంద‌నే చెప్పాలి. ఎందుకొంటే కొన్నిసార్లు స్లీప్‌మోడ్‌లోకి వెళ్లిన యంత్రాల‌ను మ‌ళ్లీ ఆన్ చేస్తే అవి పేలిపోవ‌డ‌మో ఫెయిల్ అవ‌డ‌మో వంటివి అవుతుంటాయి. ఎందుకంటే జాబిల్లి ద‌క్షిణ దృవం పైన ఈ 14, 15 రోజుల పాటు ఎలాంటి సూర్య కిర‌ణాలు ప‌డ‌వు. దాంతో ఉష్ణోగ్ర‌త మైన‌స్ 240 డిగ్రీ సెల్సియ‌స్‌కి ప‌డిపోతుంది. అంటే గ‌డ్డ క‌ట్టేంత చ‌ల్ల‌గా అయిపోతుంది. అప్పుడు విక్ర‌మ్, ప్ర‌జ్ఞాన్‌ల‌లో అమ‌ర్చిన బ్యాట‌రీలు ఎలా రెస్పాండ్ అవుతాయో తెలీదు. ఈ నెల 22న వీటిని నిద్ర నుంచి లేపబోతున్నామ‌ని ఇస్రో వెల్ల‌డించింది.