Hamas చెరలో యువతి.. అద్దె కట్టలేదంటూ ఓనర్ రచ్చ
ఓపక్క ఉగ్రవాద సంస్థ హమాస్ (hamas) చెరలో బందీగా ఉన్న యువతి.. మరో వైపు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ని రెంట్ ఎప్పుడిస్తావ్ అంటూ ఓనర్ వేధింపులు. ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఇజ్రాయెల్‌కి (israel) చెందిన 27 ఏళ్ల ఇన్బార్ హైమన్ అనే యువతిని గత శనివారం జరిగిన సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్లింది. సరిగ్గా అదే రోజు మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ దాడులు నిర్వహించింది. ఆ మ్యూజిక్ ఫెస్టివల్‌కి వచ్చిన వారిలో దాదాపు 250 మంది మృత్యువాతపడగా.. మరికొందరిని హమాస్ కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ అయినవారిలో హైమన్ కూడా ఉంది.
విషయం తెలీడంతో హైమన్ బాయ్‌ఫ్రెండ్ తెగ కంగారుపడుతున్నాడు. తన ప్రేయసి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాడు. ఈ నేపథ్యంలో హైమన్ ఉంటున్న ఇంటి ఓనర్ పరిస్థితుల గురించి ఆలోచించకుండా రెంట్ ఎప్పుడు ఇస్తారు అంటూ వేధిస్తున్నాడట. హైమన్ దాదాపు 600 డాలర్ల రెంట్ ఇవ్వాలని అది ఎప్పుడిస్తారని ఆమె ప్రియుడికి మెసేజ్ పెట్టాడు. హైమన్ హమాస్ చెరలో ఉందని చెప్తే.. మీరు ఇక్కడ ఉంటూ నాకేం సాయం చేయడంలేదు. వెంటనే వేరే ఇల్లు వెతుక్కోండి. వారంలో ఆమె సామాన్లు బయట పారేసి వేరొకరికి అద్దెకు ఇవ్వాలనుకుంటున్నాను అని దారుణంగా మాట్లాడుతున్నాడట. ఈ విషయాన్ని హైమన్ ప్రియుడు మీడియా ద్వారా వెల్లడించాడు. ఇదే విషయం గురించి మీడియా వర్గాల సదరు ఓనర్‌ను ఆరా తీయగా.. తాను అలా మాట్లాడలేదని.. హైమన్ త్వరగా క్షేమంగా రావాలని తానూ కోరుకుంటున్నానని తెలిపాడు. (israel gaza war)