హెజ్బొల్లా బంక‌ర్‌లో రూ.4000 కోట్లు

israel found 4000 crore in hezbollah bunker

Israel: ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసి హెజ్బొల్లా అధినేత హ‌సన్ న‌స్ర‌ల్లాను మ‌ట్టుబెట్టింది. ఈ నేప‌థ్యంలో ఇజ్రాయెల్‌కు ఇంటెలిజెన్స్ వ‌ర్గాల నుంచి కీల‌క స‌మాచారం అందింద‌ట‌. ఇరాన్‌లోని బీర‌ట్‌లో ఉన్న హెజ్బొల్లా సీక్రెట్ బంక‌ర్‌లో ఏకంగా రూ.4,150 కోట్ల న‌గ‌దు ఉన్న‌ట్లు త‌మ‌కు స‌మాచారం అందింద‌ని ఇజ్రాయెల్ వెల్ల‌డించింది. బీర‌ట్‌లోని అల్ సాహెబ్ హాస్పిట‌ల్‌లో ఈ సీక్రెట్ బంక‌ర్‌ను ఇజ్రాయెల్ గుర్తించింది. దాంతో ఇజ్రాయెల్ ఆదివారం 30 హెజ్బొల్లాకు చెందిన బంక‌ర్ల‌పై మెరుపు దాడులు చేప‌ట్టింది. ఆ నోట్ల క‌ట్ట‌ల‌ను కాల్చి బూడిద చేయాల‌ని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) స‌మాచారం ప్ర‌కారం అల్ ఖ‌ర్ద్ అల్ హ‌సన్ అనే ఛారిటీ హెజ్బొల్లాకు కోట్ల‌ల్లో ఫండ్స్ ఇస్తోంది.

ఈ ఫండ్స్ ద్వారానే హెజ్బొల్లా ఇత‌ర దేశాల‌పై దాడుల‌కు పాల్ప‌డుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇజ్రాయెల్ ఇరాన్‌పై చేసిన దాడిలో 2000 మంది హెజ్బొల్లా ఉగ్ర‌వాదులు చ‌నిపోయారు. ఇప్ప‌టి నుంచి ఇజ్రాయెల్ కేవ‌లం హెజ్బొల్లాకు చెందిన ఆర్థిక వ‌న‌రుల‌పై మెరుపు దాడులు చేప‌డుతుంద‌ని ప్ర‌క‌టించింది. ఆల్రెడీ ఇరాన్‌కు చెందిన ఓ క‌మాండ‌ర్ ఈ మెరుపుదాడుల్లో చ‌నిపోయాడు. హెజ్బొల్లాకు ఇరాన్ నుంచి ఫండ్స్ స‌మ‌కూరుస్తున్న‌ది ఈ క‌మాండ‌రేన‌ట.