Ind vs NZ: సూర్యకి గాయం.. ఇషాన్‌ని కుట్టిన తేనెటీగ!
World Cup 2023: రేపు టీమిండియా కీలక సమరానికి రెడీ అవుతోంది. ప్రపంచ కప్ మ్యాచ్‌లలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా రేపు న్యూజిల్యాండ్‌తో (ind vs nz) తలపడనుంది. ఈ నేపథ్యంలో క్రికెటర్లు సూర్య కుమార్ యాదవ్ (surya kumar yadav), ఇషాన్ కిషన్‌లు (ishan kishan) ఝలక్ ఇచ్చారు. ధర్మశాలలో వీరిద్దరూ నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా ఇషాన్ కిషన్‌కు తల వెనుక భాగంలో తేనెటీగ కుట్టింది. ఫ్లడ్ లైట్స్ కింద ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తేనెటీగ కుట్టడంతో నొప్పి భరించలేక తల్లడిల్లిపోయాడు. ప్రథమ చికిత్స అనంతరం అసలు ప్రాక్టీస్ చేయలేకపోయాడు.
సూర్యకుమార్‌కు ప్రాక్టీసింగ్ సమయంలో చేతికి స్వల్ప గాయమైంది. మొన్న జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యకు (hardik pandya) గాయం అవడంతో అతని స్థానంలో కోచ్ రాహుల్ ద్రావిడ్ సూర్య కుమార్ యాదవ్‌ను ఎంపికచేసారు. సూర్యకు ఇది తొలి వరల్డ్ కప్ మ్యాచ్. సూర్య చేతికి గాయం అవడంతో అతను రేపు మ్యాచ్ ఆడతాడో లేదో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు పటిష్ఠంగా ఉన్న కివీస్‌ని ఎదుర్కోవడం టీమిండియాకు కాస్త సవాల్‌తో కూడిన అంశమే. రేపటికల్లా వీరిద్దరూ కోలుకుని ఆడతారో లేదో చూడాలి. (india vs newzealand)