Bangladesh Protest: బంగ్లా అల్లర్లు.. ఇండియాను ట్రాప్ చేయడానికి ప్లానా?
Bangladesh Protest: బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి నిన్న ప్రత్యేక విమానంలో హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఆమె యూకే వెళ్లాల్సి ఉంది. ఆ దేశం నుంచి అనుమతి వచ్చేవరకు హసీనా ఇండియాలోనే ఉంటారు. అయితే.. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్ల విషయంపై పలువురు విశ్లేషకులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇండియాను ట్రాప్ చేయడానికి ఐఎస్ఐ కానీ చైనా కానీ వేసిన ప్లాన్ అయితే కాదు కదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేకపోతే బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరుగుతుంటే హసీనా వెంటనే ఢిల్లీ రావడం ఏంటి? ఆమెకు ఇండియా నుంచి వెంటనే అనుమతి వస్తుందని ఏమన్నా ప్లాన్ చేసారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
భారత్‌ను దెబ్బతీసేందుకు చైనా, ఐఎస్ఐ చేయని కుట్రలు అంటూ లేవు. ఈ బంగ్లాదేశ్ అల్లర్లు కూడా ఆ కుట్రల్లో భాగమేనా అని యోచిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ఆర్మీ ఎప్పుడూ ఏదో ఒక విధ్వంస కాండ సృష్టిస్తూనే ఉంటుంది. 1975లో కూడా ఇలాగే అల్లర్లు చోటుచేసుకుంటే ఆ దేశ ఆర్మీ అప్పటి ప్రధాని అయిన ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వాన్ని కూల్చేసింది. ముజీబుర్ రెహ్మాన్ ఎవరో కాదు.. షేక్ హసీనా తండ్రి. ఆయన ఆర్మీ చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యారు. రెహ్మాన్ చనిపోయాక బంగ్లాదేశ్‌లో 15 ఏళ్ల పాటు ఆర్మీ పాలన జరిగింది. ఆ తర్వాత హసీనా ఆవామీ పేరుతో రాజకీయాల్లోకి రావడం మూడు సార్లు ప్రధానిగా గెలవడం జరిగాయి.
అయితే ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అల్లర్లు మళ్లీ మిలిటరీ పాలన తీసుకురావాలనే ఉద్దేశంతో జరుగుతున్నాయేమో అని ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే స్పష్టమవుతోంది. 1971లో బంగ్లాదేశ్‌కు స్వాతంత్రం రాగానే పాకిస్థాన్ బంగ్లాను తొక్కేయాలని వేయని ప్లాన్ అంటూ లేదు. ఇప్పుడు కూడా ఈ అల్లర్లను పాకిస్థాన్ ISI సాయంతో సృష్టించిదేమో ఇందుకు చైనా కూడా సాయం చేసిందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయట. షేక్ హసీనాకు ఇండియాతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కానీ చైనా అంటే హసీనాకు ఒళ్లుమంట. ఇప్పుడు హసీనా రాజీనామా చేసింది కాబట్టి బంగ్లాదేశ్‌పై చైనా ఆధిపత్యం చెలాయించే అవకాశం లేకపోలేదు.
గతంలో పాకిస్థాన్, చైనాల వల్ల కుప్పకూలిన దేశాలివే
శ్రీలంక: చైనా నుంచి అప్పు తీసుకోవడం వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. 2022లో ప్రజల ఆందోళనలు చేపట్టడంతో లంక అధ్యక్షుడు గోటబయా రాజపక్సా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. ఆయన స్థానంలో రణిల్ విక్రమసింఘె ఉన్నారు.
అఫ్ఘానిస్థాన్: ఇప్పుడు అఫ్ఘానిస్థాన్ ఉగ్రవాదుల చేతుల్లో ఉంది. వారే దేశాన్ని పాలిస్తున్నారు.
మయన్మార్: 2021లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాన్ని మిలిటరీ దింపేసి తన స్వాధీనంలోకి తెచ్చుకుంది
నేపాల్ : చైనా వల్లే ప్రస్తుతం అక్కడ రాజకీయ పరిస్థితుల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
బంగ్లాదేశ్‌తో పాటు పైన చెప్పిన దేశాలన్నింటితోనూ భారత్‌కు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అలా భారత్‌తో మంచిగా ఉంటున్న దేశాలపై చైనా, పాకిస్థాన్ కన్నేసి మరీ ప్రభుత్వాలను కూల్చేస్తున్నాయి. దాంతో ఇప్పుడు బంగ్లాదేశ్ అల్లర్లకు పాకిస్థాన్ ఐఎస్ఐ, చైనాకు ఏమన్నా సంబంధం ఉందా అనే చర్చ మొదలైంది. అందుకే భారత్‌లో హైఅలెర్ట్ విధించారు. బోర్డర్ల వద్ద పది రెట్ల ఎక్కువ భద్రతను ఏర్పాటుచేసారు.