Kamareddy: బోర్‌బాన్ బిస్కెట్‌లో ఇనుప తీగ‌

iron wire found in bourbon biscuit

Kamareddy: పిల్ల‌లు ఇష్టంగా తినే బోర్‌బాన్ బిస్కెట్‌లో ఇనుప క‌డ్డీ బ‌య‌ట‌ప‌డింది. ఈ ఘ‌ట‌న కామారెడ్డిలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో స్థానికంగా ఉన్న దుకాణం నుంచి హనుమాన్ రెడ్డి అనే వ్యక్తి తన పిల్లల కోసం బార్‌బన్ బిస్కెట్లు తీసుకెళ్ళాడు. పిల్లలు తింటున్న సమయంలో ఓ బిస్కెట్లో సన్నని ఇనుప తీగ ఉండటాన్ని తండ్రి గమనించి వీడియో తీసి, పిల్లలు తింటున్న సమయంలో జాగ్రత్తగా ఉండాల‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.